08-10-2025 07:12:05 PM
యాచారం: మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఏడవ తరగతి చదువుతున్న జోగు మనిష్(13) పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం అప్పుడే పాఠశాల వదలడంతో ఇంటికి వచ్చిన మనీష్ పిడుగుపాటుకు మృతి చెందాడు. దీంతో కుటుంబంలోనూ, గ్రామంలోను విషాద ఛాయలు అలుముకున్నాయి.