08-10-2025 07:15:50 PM
మంథని (విజయక్రాంతి): మంథని మాతా శిశు ఆవరణలో పెద్దపల్లి జిల్లా 108 అధికారి కుమారస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. గత కొద్ది నెలలుగా డివిజన్ లో అందిస్తున్న సేవలపై, అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పనితీరును, మందులను, పలు రికార్డులు పరిశీలించారు. 24 గంటలు అంబులెన్స్ అందుబాటులో ఉండాలని, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అత్యవసర సమయంలో, ప్రజలు ప్రమాద సమయాలలో గర్భిణులను హాస్పిటల్ తరలించడానికి వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలట్ హబీబ్ అహ్మద్ పాల్గొన్నారు.