calender_icon.png 9 October, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడి తండాలో కార్డెన్ సెర్చ్

08-10-2025 10:10:29 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని లంబాడి తండా శివారులో బుధవారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి సూర్యనారాయణ మాట్లాడుతూ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని అన్నారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని ఐదు వాహనాలు, సరైన పత్రాలు లేని పన్నెండు బైకులను సీజ్ చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే 600లీటర్ల జాగరి వాష్, 60 లీటర్ల గుడుంబాని స్వాధీనం చేసుకున్నారు. కార్డెన్ సెర్చ్ లో కాటారం సీఐ నాగార్జున రావు, కాటారం, అడవి ముత్తారం ఎస్ఐలు శ్రీనివాస్, మహేంద్ర యాదవ్, కాటారం రెండు, మూడవ ఎస్సైలు రాజశేఖర్, మానసలతో పాటు 30 మంది టీజీఎస్పి సిబ్బంది, 25 మంది సివిల్ పోలీసులు పాల్గొన్నారు.