08-10-2025 12:00:00 AM
చేవెళ్ల, అక్టోబర్ 7: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్పు దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని చేవెళ్ల కోర్టు న్యాయవాదులు ఆరోపించారు. మంగళవారం చేవెళ్ల బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ముకురమ్ నర్సిములు ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి సందర్భంలోనూ సహించబోమని హెచ్చరించారు.
సనాతన ధర్మం ముసుగులో రాజ్యాంగాన్ని అవమానించేలా.. దేశ అత్యున్నత పదవుల్లో ఒకరైన సీజేఐపై షూతో దాడికి యత్నించడం దారుణమని మండిపడ్డారు. నిందితుడు న్యాయవాది రాకేష్ కిషోర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడటానికి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
కోర్ట్ బహిష్కరణలో చేవెళ్ల బార్ అసోసియేషన్ ట్రెజరర్ ఈ రవీందర్ రెడ్డి, లైబ్రేరియన్ పి మల్లేష్, స్పోరట్స్ సెక్రటరీ ఏ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ తలారి ప్రకాశం,ఈశ్వరయ్య, సీహెచ్ రవీందర్, ఎం శివరాజ్, ప్రదీప్ రెడ్డి,లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కే కుమార్, న్యాయవాదులు బిర్ల వెంకటేశం,యాది రెడ్డి, ఎన్ చంద్ర శేఖర్,సురేష్, నాగి రెడ్డి,జైపాల్,తాజుద్దీన్, గౌతం రెడ్డి, రోజా రెడ్డి, విటలయ్య,రాజశేఖర్, గోపాల్ గౌడ్,శ్రీనివాస్,సుదర్శన్, సతీష్,లోకేశ్వరి,స్వప్న,ప్రవీణ, తదితరులు