09-10-2025 12:00:00 AM
మహబూబాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడికి నిరసనగా మంగళవారం మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాదుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. ప్రేమ్ చందర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా చట్టపరంగా శిక్షార్హులే అవుతారన్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ ఆసోసియేషన్ సహాయ కార్యదర్శి ఉడుగుల హరికృష్ణ, కోశాధికారి దుదిమెట్ల మహేందర్, క్రీడల కార్యదర్శి మున్న , సభ్యులు మౌనిక, సీనియర్ న్యాయవాదులు ఎన్.వి చలపతిరావు , జనగాం వెంకటేశ్వర్లు, కే. కేశవరావు, కే. యదగిరి, కే.పద్మాకర్ రెడ్డి, జి.వి గిరి, డేగల సత్యనారాయణ, పుల్లురి క్రిష్ణయ్య, గందసిరి ఉప్పలయ్య, తుంపిళ్ళ శ్రీనివాస్, సయ్యద్ రహీమ్ పటేల్, మామిడాల సత్యనారాయణ, నలుసాని ప్రభాకర్ రెడ్డి, భూక్య మోహన్ నాయక్, పుల్లఖండం శ్రీనివాస స్వామి, బోనగిరి అమర్ నాథ్ గుప్తా, గాదే కమల్ కుమార్, దర్శనం రామకృష్ణ, పిన్ని రాము పాల్గొన్నారు.