22-08-2025 02:00:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): బ్రాహ్మణ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బ్రాహ్మణ బ్రిగే డ్ సమితి (బీబీయస్) ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కీసరలోని నాగారం చౌరస్తా రోడ్‌లో ఉన్న మీనా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 24న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ వీ వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే వీ సతీశ్, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యూ రాంమోహన్, బీవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్, బీజేపే నేషనల్ కౌన్సిల్ మెంబర్ కే గీతా మూర్తి, బీజేపీ ఎండోన్‌మెంట్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు.
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీ వెంకటరమణ, జలమండలి జీఎంలు ఎంవీ నాగపరి మణ, ఎం మాధవి, చీఫ్ ఇంజినీర్ టీజీఎయ్‌ఆర్‌టీసీ వీ శ్రీదేవి, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్ శ్రీదేవి, డీఎస్పీ విజిలెన్స్ ఆఫీసర్ టీజీఎస్‌ఆర్‌టీసీ మహంకాళి రామ మూర్తి, అడ్వకేట్లు బీ శివప్రసాద్, ఎన్ బద్రిరాజ్, సుధీర్‌కుమార్ ఎండీ జీవి ధనుంజయ్ హాజరుకా నున్నారు.
మాజేటి వేణుగోపాల్ (బీఎస్‌ఎన్ ఎల్ రిటైర్డ్ ఆఫీసర్), ఎస్ సూర్యనారాయణ మూర్తి, యూ శారద, కే ఉపేందర్, ఎం గణేశ్, వీ రాంచదర్‌రావు, కే ఉషాకుమారి, టీవీ లక్ష్మి, యూ శ్యామల, కే రాజేశ్వరి, వీఎస్ మల్లికార్జున్ తదితరు ఆహ్వానిస్తున్నారు.