calender_icon.png 22 August, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్‌లో గగన్‌యాన్ టెస్ట్ మిషన్

22-08-2025 01:48:50 AM

  1. ముహూర్తం ఖరారు చేసిన ఇస్రో
  2. వెల్లడించిన ఇస్రో చైర్మన్

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన గగన్ యాన్ టెస్ట్ మిషన్‌ను డిసెంబర్‌లో ప్రయోగించేందుకు సిద్ధం అయింది. ఇస్రో చైర్మన్ నారాయణ్ ఈ మేరకు ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో కలిసి ఢిల్లీలో నారాయణ్ మీడియా సమావేశంలో పాల్గొ న్నారు. నారాయణ్ మాట్లాడుతూ.. ‘దశాబ్దం కింద అంతరిక్ష రంగంలో దేశంలో ఒకే స్టార్ట ప్ ఉండేది.

ఇప్పుడు వాటి సంఖ్య 300కు చేరుకుంది. ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష రంగంలో క్రియాశీలకంగా పాల్గొం టున్నాయి. ప్రైవేటు సంస్థలు రెండు సబ్ ఆర్బిటల్ మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. జీ-20 దేశాల కోసం ప్రత్యేకంగా జీ20 శాటిలైట్ రూపొందించాం. ఇది గ్లోబ ల్ సౌత్ దేశాలకు సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. 

గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మాట్లాడుతూ.. ‘అసలు నేను అంతరిక్షంలోకి వెళ్తాను అని అస్సలుకే ఊహించలేదు. కానీ నేను అంతరిక్షానికి వెళ్లాను. మీరు కూడా వెళ్లగలరు. త్వరలోనే మన భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కాబోతుంది’ అని పేర్కొన్నారు.