calender_icon.png 22 August, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటి ఆరోపణలు.. యువనేత రాజీనామా

22-08-2025 01:53:09 AM

  1. కేరళ కాంగ్రెస్ యూత్ అధ్యక్ష పదవి వదులుకున్న ఎమ్మెల్యే
  2. తనను ఓ నేత వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసిన రిని జార్జ్
  3. సదరు నేత హోటల్‌కు పిలిచాడని ఆరోపణ
  4. ప్రకంపనలు రేపుతున్న వివాదం

తిరువనంతపురం, ఆగస్టు 21: కేరళ కాంగ్రెస్ యువనేత, పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై నటి, మోడల్ రిని అన్ జార్జ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాహుల్ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రిని పలు ఇంటర్వ్యూలలో ప్రముఖ పార్టీకి చెందిన ఓ నేత తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నా.. ఆ నేత ఎవరనేది పేరు వెల్లడించలేదు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆ నేత రాహుల్ అని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం రాహుల్ ప్రకటించారు. ఈ ఆంశంపై అంతర్గత విచారణ జరుపుతున్నట్టు కేరళ కాంగ్రెస్ ప్రకటించింది. 

హోటల్‌కు పిలిచాడు.. 

ఓ యువతనేత తనను హోటల్‌కు పిలిచాడని నటి రిని జార్జ్ ఆరోపించారు. ‘అనేక సందర్భాల్లో అసభ్యకర మెస్సేజులు పంపు తూ వేధించాడు. పార్టీ నాయకత్వానికి ఫిర్యా దు చేస్తానని బెదిరించినా.. నీకు నచ్చింది చేసుకో అని అన్నాడు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలిపినా ప్రయోజనం లేదు. ఎంతో మంది రాజకీయ నాయకుల భా ర్యలు, కూతుర్లు ఇటువంటి ఎదుర్కొన్నారని వారు పేర్కొన్నారు.

కుటుంబంలోని భార్య లు, పిల్లలనే కాపాడుకోలేని రాజకీయ నా యకులు.. బయటి మహిళను ఎలా రక్షిస్తారని నేను అడగాలనుకుంటున్నాను’ అని అ న్నారు. ఇన్ని ఆరోపణలు చేసిన రిని ఆ యువనేత పేరు వెల్లడించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీషన్ స్పందించారు. ‘ప్రస్తుతానికి ఫిర్యాదు అందింది. అంతర్గత విచారణ చేపట్టాం. దోషులు ఎవరైనా సరే తప్పించుకోలేరు’ అని పేర్కొన్నారు.