27-06-2025 12:00:00 AM
శ్రీశైలం వెళ్తుండగా దోమలపెంట వద్ద ఘటన
నాగర్‌కర్నూల్, జూన్ 26 (విజయక్రాంతి): శ్రీశైలం దైవదర్శనానికి వెళ్తున్న ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట గ్రామ సమీపంలో చోటుచేసుకోగా.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జనగామ జిల్లాకు చెందిన భక్తులు ట్రావెల్ బస్సులో శ్రీశైలం దైవదర్శనానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ అదుపు చేసే క్రమంలో బస్సు బోల్తా కొట్టింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.