27-07-2025 05:06:34 PM
కొనసాగుతున్న శ్రమదానం..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr. Jatoth Ramachandru Naik) రైజింగ్ తెలంగాణ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ పట్టణంలో శనివారం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేసి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను స్వయంగా వారితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం మొక్కలను నాటారు. ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా వైద్య కేంద్రాల వద్ద పరిశుభ్రంగా ఉండేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విప్ పిలుపుమేరకు మరిపెడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ క్యాడర్ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని, మరిపెడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తాజుద్దీన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీపాల్ రెడ్డి, గంగయ్య, ఉపేందర్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్, లక్ష్మీనారాయణ, రవి, బల్లెం రవి, అక్బర్, వెంకట సాయి, శ్రీను, మున్సిపల్ ఆఫీసర్ వీరన్న నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.