27-07-2025 05:08:35 PM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జగిత్యాల మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(District Collector Satya Prasad) అధికారులను ఆదేశించారు. ఆదివారం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీల పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు ఎక్కువ పడనున్నందున డ్రైనేజీలలో చెత్త డబ్బాలు, ప్లాస్టిక్ కవర్స్ లాంటివి ఎక్కడైనా ఉన్నట్లయితే వెంట వెంటనే తీయించి శుభ్రం చేయించాలని వర్షపు నీరు అక్కడక్కడ నిలిచినట్లయితే ఆయిల్ బాల్స్ వేయించాలని, పిచ్చి మొక్కలు ఉన్నట్లయితే తీయించాలని, సానిటైజర్ చేయిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులని ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల్ మున్సిపల్ అధికారి స్పందన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.