27-07-2025 05:04:06 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గూడూరు మండలం కోబాల్ తండాకు చెందిన భానోత్ బాలు(50) తండా సమీపంలోని రాళ్లవాగు వద్ద కాలుజారి పడిపోవడంతో మరణించినట్లు గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి(SI Giridhar Reddy) తెలిపారు. పొలం వద్దకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో బాలు భార్య భానోత్ బుజ్జి తండావాసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు, గ్రామస్తులు రాళ్ల వాగులో వెతకగా బాలు మృతదేహం లభించిందన్నారు. ప్రమాదవశాత్తు కాలు జారి పడి ఉంటాడని, దీంతో తీవ్ర గాయాలు నీట మునిగి చనిపోయే ఉంటాడని, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.