27-07-2025 05:10:50 PM
జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ సౌధగర్ అరవింద్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) పెద్ద కొడపగల్ మండలం కాటేపల్లి తండాలో అటవీశాఖ అధికారులు గిరిజనులకు చెందిన పోడు భూముల్లో పత్తి పంటను ధ్వంసం చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్(State SC Cell Chairman Saudagar Arvind) ఆదివారం తండాకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అటవీశాఖ అధికారులు పోడు భూములలో పంటలు పండించుకుంటున్న రైతులకు సంబంధించిన భూముల పంటలను ధ్వంసం చేసి నష్టం కలిగించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. గిరిజనులతో కలిసి అటవీశాఖ అధికారులు ధ్వంసం చేసిన పోడు భూముల స్థలాన్ని పరిశీలించారు. గిరిజన రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ సౌధాగర్ అరవింద్ తెలిపారు.