27-07-2025 04:49:36 PM
మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్(Taekwondo Association) ప్రధాన కార్యదర్శిగా రంగు శ్రీనివాస్ ను నియమిస్తూ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాజిద్ అలీఖాన్ ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ను నియమించారు. ఈ సందర్భంగా రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ, తైక్వాండో క్రీడకు మంచి భవిష్యత్తు ఉందని పిల్లలకు తైక్వాండో నేర్పించటం వలన శారరీకంగా మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. నాపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వజిద్ అలీఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం కృష్ణ, కోశాధికారి మారుతి లకు కృతజ్ఞతలు తెలిపారు.