calender_icon.png 27 July, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన కేసీఆర్

27-07-2025 04:45:52 PM

సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చిన్న గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేశారని మహబూబాబాద్ జిల్లా సీపీఐ కార్యదర్శి విజయ్ సారధి రెడ్డి(CPI Secretary Vijay Saradhi Reddy) ఆరోపించారు. తెలంగాణ గిరిజన సమాఖ్య(టీజీఎస్) జిల్లా సమావేశం జిల్లా కేంద్రంలోని వీరభవన్ లో లావుడియా రాము నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయ సారథి మాట్లాడుతూ.. గత పదేండ్ల టిఆర్ఎస్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు. ఎంతోమంది గిరిజన సర్పంచ్ లు టిఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారని, ఎస్టీ ప్లాన్ నిధులను దారి మళ్లించి పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. తండాల్లో ఇప్పటికీ మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు లేక ఎక్కడి వేసినగొంగడి అక్కడే చందంగా ఉన్నాయని ఆరోపించారు.

కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి గిరిజన తండాల్లో ఆదివాసీగూడాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో నాడు ఆందోళన చేశామని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 2న గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లావుడ్యా రాము నాయక్, ప్రధాన కార్యదర్శి మాలోతు రవీందర్ నాయక్, సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి, యాక్య నాయక్, బాలాజీ, బిచ్చు నాయక్, రాము, విజయ్, రాగం మల్లయ్య, బావ్ సింగ్, పెరుగు కుమార్ పాల్గొన్నారు.