calender_icon.png 10 October, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలకు బ్రేక్

10-10-2025 01:00:36 AM

హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేసిం ది. స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ను తదుపరి నోటిఫికేషన్ వచ్చేవరకు నిలిపివే సింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నికల కోడ్‌ను కూడా ఎత్తివేసింది.

స్థానిక సంస్థ ల ఎన్నికలపై హైకోర్టు తీర్పును పాటిస్తామని గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కోర్టు అర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేయడంతో అప్పటివరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని పేర్కొన్నారు. కాగా, అంతకు ముందు ఉదయం 10:30 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.