calender_icon.png 10 October, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి రూ.101016 విరాళం

10-10-2025 01:00:24 AM

వనపర్తి అక్టోబర్ 9 ( విజయక్రాంతి ) : కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆల య నిర్మాణానికి కొత్తకోట పట్టణ స్థిరనివాసులు కీ.శే ఎద్దుల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఎద్దుల సత్యమ్మ కుమారులు ఎద్దుల రాజేశ్వరీ రవికుమార్ రెడ్డి, రవి రెడ్డి ( శ్రీ సాయి హైవే కేఫ్ ) దంపతులు 1,01,016/- ( ఒక లక్ష ఒక వేయి పదహారు రూపాయలు ) విరాళం ప్రకటించారు.

గురువారం అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు , పొగాకు అనీల్ కుమార్ , బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , విశ్వనాథం గంగాధర్ , ఆకుల శ్రీనివాసులు, మద్దిగట్ల బాలకృష్ణారెడ్డి , ఎల్ల రెడ్డి , భాస్కర్ సాగర్ , రాజవర్ధన్ రెడ్డి , లక్ష్మీ నారాయణ యాదవ్ , వేముల సుధాకర్ రెడ్డి , భీమ కిషోర్ లకు వారు అందజేశారు.ఈ సందర్భగా అయ్యప్ప సేవాసమితి తరపున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.