10-10-2025 01:01:20 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
హత్నూర(సంగారెడ్డి), అక్టోబర్ 9 :మండల కేంద్రమైన హత్నూర పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఏటిసి సెంటర్లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు ,అన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు, శిక్షణా సౌకర్యాలు, సెంటర్లో ఉన్న అవసరాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఏ ఏ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు విద్యార్థులకు అందుతున్న అధునాతన శిక్షణ పై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం హత్నూర పీహెచ్సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డులను, మెడికల్ స్టోర్ రూమ్ లో మందుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.