calender_icon.png 1 November, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లాష్‌మాబ్‌తో బ్రెస్ట్ క్యానర్‌పై అవగాహన

01-11-2025 12:46:29 AM

అపోలో కాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): బ్రెస్ట్ క్యానర్‌పై అవగాహన పెంపొందించేందుకు అపోలో క్యాన్సర్ హాస్పిటల్, క్యూర్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. బంజారాహిల్స్‌లోని జివికే వన్ మాల్‌లో శుక్ర వారం సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ అందరి దృష్టిని ఆకర్షించింది. చెక్. కేర్. క్యానర్ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళల్లో ముందస్తు పరీక్షల ప్రాధాన్యాన్ని తెలియజేసింది.

అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్య విద్యార్థులు, డాక్టర్లు, నర్సులు పాల్గొన్న ఈ ప్రదర్శన మాల్ను సందడి వాతావరణంగా మార్చింది. సినీ నటులు పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణ లభించింది. ముఖ్య అతిథులుగా నటి అతిథి పాల్గొన్నారు. నటుడు డా. భారతరెడ్డి అవగాహన కార్యక్రమాల అవసరాన్ని హైలైట్ చేశారు. అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. పి. విజయ ఆనంద్‌రెడ్డి మాట్లా డుతూ.. “‘క్యాన్సర్‌పై ఉన్న భయాలను, అపోహలను తొలగించేందుకు ప్రజల్లోకి వచ్చి ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు చేస్తాం.

మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ముంద స్తు గుర్తింపు ప్రాణాలు కాపాడుతుంది” అని తెలిపారు. ప్రముఖ షాపింగ్ గమ్యస్థానం అయిన జివికే వన్ మాల్‌ను ఎక్కువ మందికి చేరువ కావడానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. మాల్‌కు వచ్చిన సందర్శ కులకు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణ సూచనలు ఉన్న బుక్మారక్స్ పంపిణీ చేశారు.