01-11-2025 12:47:37 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. మొంథా తుఫాన్ ప్రభావం లేకపోవడంతో వాతావరణ శాఖ శుక్రవారం ఎలాంటి హెచ్చరికలూ జారీ చేయలేదు. అయితే రానున్న రెండు మూడు రోజులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.