calender_icon.png 9 May, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల దందా

09-05-2025 12:50:16 AM

-అనుమతులు తీసుకోరు 

-ఇష్టం సారంగా ఇటుకబట్టిల వ్యాపారం 

-రెవెన్యూ, మైన్స్, అటవీ, శాఖ అధికారులకు మామూల్లు

-చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు 

-అనుమతులు గోరంతకొండంత వ్యాపారం 

-కామారెడ్డి జిల్లాలో యదేచ్చగా ఇటుకబట్టి వ్యాపారం 

బాన్సువాడ, మే 8 (విజయ క్రాంతి):, ఇటుక బట్టీల అక్రమంగా జోరుగా కొనసాగిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు మామూలుగా అలవాటు పడి చూసి చూడనట్లు గా వ్యవహరిస్తున్నారు.

దీంతో మూడు పూవులు ఆరు కాయలు అన్న చందంగా నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లో కేవలం 3 ఇటుక బట్టీల వ్యాపారులు మాత్రమే అధికారుల నుంచి అనుమతులు 100 వరకు ఇటుక బట్టీల వ్యాపారులు ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా..

కామారెడ్డి జిల్లాలో నీ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఇటుక బట్టీల  దందా జోరుగా కొనసాగిస్తున్నారు. చత్తీస్గడ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి ఇటుకల తయారీ చేపడుతున్నారు. ఒక జంటకు 10000 చొప్పున అడ్వాన్స్ చెల్లించి ఐదు నుంచి పది జంటల వరకు కార్మికులను తీసుకువచ్చి ఇటుక తయారు చేయిస్తున్నారు.

కనీస కార్మిక చట్టాలను అమలు చేయకుండా పొద్దంతా రాత్రంతా పగలు అనే తేడా లేకుండా పనులు చేస్తున్నారు. లక్ష ఇటుక తయారు చేస్తే 5 వేలు చెల్లిస్తున్నారు. వారికి కనీస వైద్య సౌకర్యం కూడా కల్పించడం లేదు. వారి పిల్లలకు విద్య సౌకర్యం లేదు.

ఇకబట్టిల వ్యాపారం స్థానిక రెవిన్యూ అధికారులతో పాటు అటవీశాఖ అధికారులు మైన్స్ అధికారుల కార్మిక శాఖ అధికారుల నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటీని గాలికి వదిలేసి నిబంధనలు పాటించకుండా ఇటుక బట్టి వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బాన్సువాడ డివిజన్ లోజోరుగా ఇటుక దందా 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లో ఇటుక బట్టీల దందా కొనసాగిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఈగబట్టిల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేక అక్రమార్కులకు వరంగా మారుతుంది.

సంబంధిత రెవిన్యూ మైనింగ్ శాఖా అధికారులు ఇటికబట్టిలపై పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ మామూలు మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయా శాఖల అధికారులు పర్యవేక్షణ చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉండగా మామూళ్ల మత్తులో పడి కళ్ళు మూసుకుంటున్నారు.

ఇటుక బట్టీల వ్యాపారం లాభ సాటి వ్యాపారం కావడంతో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా ఇటుక బట్టిలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ కూడా ఎగ గొడుతున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలోనూ ఇండ్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతుండడంతో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు అంతట ఏర్పాటు చేస్తున్నారు. 

విద్యుత్ దుర్వినియోగం 

 రైతు సేద్యానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తుంటే ఇటుక బట్టి వ్యాపారులు ప్రత్యేకంగా విద్యుత్ కనెక్షన్ పొందాల్సి ఉండగా వ్యవసాయ కనెక్షన్ వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇటుక బట్టీలు కాల్చేందుకు చెట్లను కొట్టి కాల్చేందుకు  తేస్తున్నారు.

అటవీ శాఖ అధికారుల అనుమతులు లేకుండానే ఇటుక బట్టి వ్యాపారులు నిర్వహి స్తున్నారు. ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సుమారు పది లక్షల మీటర్ లా మట్టిని అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 100 పైగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. 

మామూళ్ల మత్తులో రెవెన్యూ, విద్యుత్, మైన్స్ అధికారులు 

కామారెడ్డి జిల్లాలో ని బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం మూడు ఇటుక బట్టి అనుమతులు తీసుకోవడం చూస్తుంటే ప్రభుత్వానికి ఏ మేరకు గండి కొడుతున్నారు అర్థమవుతుంది. సుమారు 100కు పైగా ఇటుక నిర్వహిస్తున్నారు. 

అనుమతులు లేకుంటే పెనాల్టీ విధిస్తాం.. 

కామారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తే పెనాల్టీ విధిస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాo.

- సతీష్, మైనింగ్ శాఖ జిల్లా అధికారి, కామారెడ్డి