calender_icon.png 1 May, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా పూర్తి మద్దతు భారత్‌కే

01-05-2025 12:06:43 AM

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ 

ఇది భయంకరమైను ఉగ్రచర్య: యూకే ప్రభుత్వం

లండన్: జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాం ఉగ్రదాడిని ‘భయంకరమైన ఉగ్రచర్య’గా బ్రిటన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న యూకే ఉగ్రవాద అణచివేతకు సంబంధించి తమ మద్దతు పూర్తిగా భారత్‌కే ఉంటుందని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. బుధవారం లండన్ పార్లమెంట్ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా దేశ విదేశాంగ మంత్రి హమిష్ ఫాల్కనర్ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 22న భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వినాశకచర్య. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పహల్గాంలో ప్రశాంత వాతావరణం అవసరం. దీని కోసం ప్రపంచంలోని అన్ని వైపుల నుంచి నాయకులు కలిసికట్టుగా రావాలని కోరుతున్నాం. ఉగ్రవాదం అణచివేయడం కోసం మా మద్దతు ఎల్లప్పుడు భారత్ కే’ అని చెప్పుకొచ్చారు.