calender_icon.png 29 October, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమామహేశ్వరం వద్ద విరిగిపడిన కొండచరియలు

29-10-2025 11:04:16 AM

ప్రమాదకరంగా పరిసరాలు. 

కొండపై నుంచి జాలువారుతున్న నీటిదార. 

అచ్చంపేట: మొంథా తుఫాన్(Cyclone Montha) ప్రభావంతో నల్లమల్లలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట సమీపంలోని శ్రీశైలం ఉత్తరముఖ ద్వారంగా పిలిచే శ్రీ ఉమామహేశ్వర వద్ద పాపనాశనం వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులెవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

భారీ కొండ చరియలు(landslides ) మెట్ల దగ్గర ఉన్న స్నానపు గదులపై పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఎడతెరిపిలేని వర్షాల వలన కొండ పై నుంచి భారీగా నీటి ధార కిందకు దూకుతోంది. ఆలయ పరిసరాలు ప్రమాదకరంగా మారడంతో భక్తుల రాకను నిలిపివేశారు. కొండపైన ఉన్న సిబ్బందిని సైతం ట్రాక్టర్ సాయంతో కిందికి తీసుకొచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు భక్తులెవరు ఆలయం వద్దకు రావద్దని ఆయన కోరారు.