29-10-2025 11:00:40 AM
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ,(విజయక్రాంతి): వాతావరన శాఖ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో... క్షేత్ర స్థాయి లో అధికారులు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Shaik) అన్నారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల... రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులను బుధవారం ఉదయం టెలి కాన్ఫెరెన్స్ ద్వారా ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.