25-07-2025 12:21:34 AM
నిజామాబాద్ లీగల్ జూలై 24: (విజయ క్రాంతి): అన్నను చంపుతానని బెదిరించిన క్రిమినల్ కేసులో తమ్మునికి ఐదు వేల రూపాయల జరిమానా విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జూనియర్ సివిల్ జడ్జి ) ఖుష్భూ ఉపాధ్యాయ్ గురువారం తీర్పు వెలువరించారు.
వివరాలు నిజామాబాద్ నగరంలో నాందేవ్ వాడలో నివాసముండే ఛిద్రవర్ బండు పాటిల్, మార్వాడి గల్లీ నివసించే అనిల్ పాటిల్ ఛిద్రవర్ అన్నదమ్ములు వృత్తిరీత్యా బంగారం వ్యాపారస్థులు. వీరి మధ్య వ్యాపారం విషయంలో విబేధాలు తలేత్తాయి.మధ్యవర్థుల సూచనలు మేరకు ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు.
బండు పాటిల్ తన మరో తమ్ముడైన శివ కుమార్ పాటిల్ తో కలిసి వ్యాపారం చేస్తున్నది జీర్ణించుకోలేని అనిల్ పాటిల్ 22 ఫిబ్రవరి, 2019 న బండు పాటిల్ బంగారు దుకాణంకు వెళ్లి గొడవచేసి మిగతా తమ్ముళ్లతో వ్యాపారం ఎందుకు చేస్తున్నావంటు, చంపి వేస్తానని బెదిరించిన నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో అనిల్ పాటిల్ ఛిద్రవర్ కు వేయి రూపాయల జరిమానా విదిస్తూ జడ్జి ఖుష్భూ తీర్పు చెప్పారు