calender_icon.png 3 November, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీకార్యాలయంపై దాడిని ఖండించిన బీఆర్‌ఎస్ శ్రేణులు

03-11-2025 12:05:28 AM

బూర్గంపాడు,నవంబర్ 2,(విజయక్రాంతి):మణుగూరు మండలంలో బిఆర్‌ఎ స్ పార్టీ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ తగులబెట్టి పార్టీ శ్రేణులపై దాడి చేసి పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బూర్గంపాడు మండల బిఆర్‌ఎస్ నా యకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సారపాక ప్రధాన కూడలి నందు బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశా రు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని, పది ఏళ్ల పాలన లో బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని తెలిపారు. రా ష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. రాబో యే రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వమే పరిపాలన సాగిస్తుందని అన్నారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే దాడికి యత్నించిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేనిచో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు బెజ్జంకి కనకాచారి, యేసోబు, వలదాసు సాలయ్య, కె వి రమణ,తుపాకుల రవి,నాగేశ్వరావు,యువజన విభాగం కృష్ణ, చైతన్య రెడ్డి, పంగి సురేష్,మూడ్ మణికంఠ, ధర్మసోత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.