calender_icon.png 3 November, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుల మీద తప్పులు!

03-11-2025 12:01:52 AM

  1. ఆపై అనుమతుల పేరుతో బుకాయింపులు
  2. అనుమతులుంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఎందుకు? 
  3. నిర్మించింది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 
  4. ఆన్లైన్లో చూపింది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే 
  5. ప్రభుత్వ ఆదాయానికి గండి 
  6. తన యూనిట్తో సంబంధం లేదని తండ్రి ప్రకటన 
  7. తల్లిదండ్రుల పేరుతో ఆస్తులు 
  8. ఫంక్షన్ హాల్ మాటున హవాలా కుంభకోణం?

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2 (విజయక్రాంతి): చెప్పేది శ్రీరంగనీతులు.. దూరే ది..? అన్న చందాన ఉంది సు..రేసుడితంగం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పు ల మీద తప్పులు చేస్తూ.. రాజకీయ, ఆర్థిక బలంతో ప్రజలను, అధికారులను, వ్యవస్థ ను తప్పు పట్టిస్తూ పైగా సద్దుపూసల బుకాయింపులకు పాల్పడడమే గమ్ముతుంది.

2016లో పాల్వంచ పట్టణ పరిధిలోని 817/ 58 లో సోషల్ వెల్ఫేర్ పట్టా భూమి మూ డు ఎకరాలు కొనుగోలు చేసిన ఆ ప్రబుద్ధుడు అక్కడ జాగలేఖనం, తనకు అనుకూ లంగా ఉండాలనో ఆరేళ్ల తర్వాత అధికారులకు అడిగినంత ఇచ్చి అంటే 2022లో 817/ 1 లో జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దర్జాగా ఎ లాంటి అనుమతులు లేకుండా విలాసవంతమైన భవనాలు నిర్మాణం చేశారు. అందుకు అధికారులు అడ్డం రాకుండా సహకరించేందుకు అప్పటి ప్రజాప్రతినిధికి రూ కోటి క పం కట్టినట్టు ప్రచారం సాగుతోంది.

ఆనమతులు లేకపోవడం, కొనుగోలు చేసిన స్థలం లో కాకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేయడం కారణంగా అప్పటి మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లను ఇవ్వడానికే నిరాకరించారు. గత ప్రభుత్వం కల్పించిన సెల్ఫ్ అసెస్మెంట్ ను ఆసరా చేసుకొని 20-1-ఇన్ 0001, 20- 1- ఇన్ 0002గా రెండు నెంబర్లను పొందారు. అనుమతులు లేని నిర్మాణాలకు 100 శాతం అపరాధ రుసుముతో మున్సిపల్ అధికారులు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు.

అదే తనకు అనుమతి అనే భ్రమలో ఉన్నాడా మహానుభావుడు. అంతేకాదు ఫంక్షన్ హాల్ కు వెళ్లేందుకు అప్పటి తహసిల్దార్ రక్షించి పెన్సింగ్ ఏర్పా టు చేసిన ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 61ని ఆక్రమించి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ వివాదం కోర్టు మెట్లు ఎక్క గా, కోర్టును సైతం తప్పుదోవ పట్టించడం జరిగిందని అధికారులే చెవులు కోరుకొంటున్నారు. 

అక్రమంలోనూ తప్పులే..

సదరు మహానుభావుడు నిర్మించిన హెచ్ కన్వెన్షన్ హాల్ 20-1-ఇన్ 0001గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ గా నిర్మించి వ్యాపారం చేస్తున్నా రు. దానికి నాన్ రెసిడెన్షియల్ గా ఆన్లైన్లో ఫస్ట్ ఫ్లోర్ ను మాత్రమే చూపి, ఫస్ట్ ఫ్లోర్ ను దాచిపెట్టి ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి కొట్టాడా మహానుభావుడు. అక్రమాలను వెలుగు చూపిన విజయ క్రాంతి పై అవాకు లు చవాకులు పేలుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడా సద్దుపూస. 

తనయుడితో సంబంధం లేదు

సదరు ఆ ప్రబుద్ధుడు కన్న తండ్రి తమ కుటుంబానికి, తన తనయుడైన సురేష్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని, అతను చేసిన అప్పులకు, అతని వ్యవహారాలకు త మకు ఎలాంటి సంబంధం లేదని 2013లో న్యాయవాది తో పేపర్లో లీగల్ ప్రకటన చేయటం గమనార్హం. ఇప్పటికే తనయుడిపై అనేక ఆర్థిక ఆరోపణలు వెలబడుతున్నాయి. మెడికల్ సీట్ పేర్లతో, రాజ్యసభ సీట్లు ఇప్పిస్తానన్న నెపంతో రూ. కోట్ల వసూలు చేసిన ట్టు ఆరోపణలు ఉన్నాయి.

ప్రకటనలో వెలువడిన కొంత కాలానికి ఆ ప్రబుద్ధుడు తల్లి దండ్రుల పేరుతో పాల్వంచలో ఆస్తులు కొనుగోలు చేయడం, భవంతులు నిర్మించారు. వాటి వ్యవహారాలన్నీ తనయుడైన సురేష్ రెడ్డి చూడటం వెలువడిన ఆరోపణలను ధ్రువపరుస్తున్నాయి. బాధితులు కు టుంబ సభ్యులపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా పథకం ప్రకారం ముందస్తుగా ప్రకట న చేసి, అనంతరం ఆస్తులన్నీ వారి పేరుతోనే ఉంచటం వారి ముందు చూపుకు నిదర్శనం.

ఇంటి పేరు ఎటు పోయింది గువ్వల చిన్నా?

సదరు ఆ సద్దుపూస తండ్రి ఇంటి పేరు నాగిరెడ్డి రామిరెడ్డి, తనయుడి దగ్గరకు వచ్చేలోగా నల్ల సురేష్ రెడ్డి గా రూపాంతరం చెందడంలో అంతర్యం ఏమిటో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఒకవైపు కుమారుడితో సంబంధం లేదంటూ ప్రకటన, మరోవైపు వారి పేరుతో ఆస్తులు వెలువడటం, సమాజంలో సామాజిక సేవాతత్పరు డుగా చలామణి కావడం వెనుక అనేక అనుమానాలు సందేహాలు తలెత్తుతున్నాయి.

హవాలా కుంభకోణం?

ఫంక్షన్ హాల్ మాటున అసలు ఏం జరుగుతోంది అనే అనుమానాలు తలెత్తుతు న్నాయి. ఎలాంటి వ్యాపారాలు, పరిశ్రమలు, కాంట్రాక్టులు లేని ఆ మహానుభావుడు తరచూ విదేశాల పర్యటనలో తలమునకై ఉండటం, బడా రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, బెంగళూరు, కర్ణాటక, అమెరికా, హైదరాబాద్ అంటూ నెలలో 20 రోజులు పర్యటించడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమ కోరుతున్నాయని అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఒకవైపు హవాలా కుంభకోణం కొనసాగుతుందా అనే ప్రశ్న పలువురిలో ఉత్పన్నమవడం గమనార్హం. అధికారులు అన్ని కోణాల నుంచి విచారిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ముందుకు వెళుతుందా, తమకు ఎందుకులే అని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందా వేచి చూడాల్సిందే.