calender_icon.png 3 November, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏ రోడ్డులో వైన్, బెల్ట్ షాపులు పెట్టొద్దంటూ ఫ్లెక్సీల ఏర్పాటు

03-11-2025 12:12:34 AM

భద్రాచలం, నవంబర్ 2, (విజయక్రాంతి):భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏకు ఎదురుగా ఉన్న వైఎస్సార్ నగర్ సమీపంలో వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టొద్దంటూ ఆదివారం ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ప్రాంతం లో బడి, గుడి, ట్రైబల్ మ్యూజియం తదితర ప్రధానమైనవి ఉన్న నేపథ్యంలో భక్తులు, విద్యార్థినీ విద్యార్థులు,

పర్యాటకులు నిత్యం సంచరించే ప్రాంతంలో వైన్ షాపులు, బెల్ట్ షాపులను నివారించాలని స్థానికులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దయచేసి వ్యాపా రులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని వారు కోరారు. అధికారులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ నగరవాసులు నినదిస్తున్నారు