15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పార్టీలకతీతంగా 11వ వార్డు అభివృద్ధి చేస్తా

06-02-2026 01:39 AM

గడ్డపోతారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగరి మల్లేష్ ముదిరాజ్ 

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి5(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో మర వకుండా ఓటు వేసి గెలిపించాలని గడ్డపోతారం 11వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్య ర్థి జలగరి మల్లేష్ ముదిరాజ్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేస్తున్న11వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ మహిళలతో కలిసి గులాబీ కండువాలు కప్పుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటర్ల చేతిలో చేయి వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.

మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ అల్లుకుపోతున్నారు. పెద్దల ఆశీ ర్వాదం  తీసుకుంటూ.. మరవకుండా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చిన హామి లన్నీ అమలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్, భాస్కర్, రమేష్, దశరథ్, నరసింహ, చాకలి దశరథ్, కృష్ణ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.