calender_icon.png 29 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో భక్తజన సందోహం

29-12-2025 02:21:53 AM

ముందస్తు మొక్కులకు తిప్పలు

పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం

గద్దెలపై పెరిగిన రద్దీ 

మేడారం, డిసెంబర్ 28 (విజయక్రాంతి): వరుస సెలవులతో ముందస్తుగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి మేడా రం బాట పట్టారు. నాలుగు రోజుల నుంచి మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం భక్తుల సంఖ్య మరింత పెరిగింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి వాహనాల్లో మేడారం తరలిరావడ ంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. నార్లాపూర్ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారాయి.

ఓవైపు సిమెంట్ రోడ్డు వేసి మరోవైపు సింగిల్ రోడ్డు పై ఇరువైపులా వాహనాలను అనుమతించడంతో తరచుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. దీంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. జంపన్న వాగు, గద్దెల ప్రాంగణం భక్తుల తో కిక్కిరిసిపోయింది. జాతరకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని అంచనా వేసిన ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నా థ్ పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేశారు. భక్తులు ఇబ్బందులు లేకుండా వనదేవతలను దర్శించుకుని బయటకు వచ్చేందుకు  ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు. 

జాతరకు ముందే ఇబ్బందులు

అయితే జాతరకు ఇంకా నెల రోజులు గడువు ఉండటంతో భక్తులకు సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించకపోవడంతో ముం దస్తు మొక్కులు చెల్లించడానికి వస్తున్న భక్తులకు పలు ఇబ్బందులు తప్పడం లేదు. మే డారం పరిసరాలు వ్యర్థాలతో భక్తుల ముక్కుపుటలు అదరగొడుతున్నాయి. శానిటేషన్ నిర్వహణ కోసం ప్రస్తుతం కొద్ది మందితో నిర్వహిస్తున్నప్పటికీ, అంచనాకు మించి భక్తులు వస్తుండటంతో వ్యర్ధాల తొలగింపు ఇబ్బందికరంగా మారింది.

జంపన్నవాగులో స్నానం ఆచరించేందుకు ఇరువైపులా స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ రేయింబవళ్లు బ్యాటరీ టాప్స్ ఆన్ చేసి ఉంచడం లేద ని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రధాన రహదారి ఒక్కటే కావడం, అక్కడికి వాహనాలు వెళ్లడానికి అనుమతించకుండా జంపన్న వాగు దాటిన తర్వాత పార్కింగ్ చేయిస్తుండటంతో చాలా దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు పేర్కొంటున్నారు.

గద్దలపై మొక్కులు సమర్పించుకో వడానికి అవసరమైన హుండీలను ఏర్పాటు చేయకపోవడంతో ఒడిబియ్యం, నగదు, బం గారు వెండి మొక్కులు చెల్లించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నగదు మొక్కు లు చెల్లించుకోవడానికి కెనరా బ్యాంకు స్కా నింగ్ హుండీలను ఏర్పాటు చేసింది. అయి తే చాలామంది ఎత్తు తూకంతో నాణా లు సమర్పించడం ఇబ్బందికరంగా మారిందని చెపుతున్నారు. గద్దెల వద్ద రద్దీ పెరిగి భక్తులకు అమ్మవారి పసుపు కుంకుమ పొం దలేకపోతున్నట్లు  ఆవేదన వ్యక్తం చేశారు.