14-05-2025 12:53:36 AM
పెబ్బేరు ఎప్రిల్ 13: మండల కేంద్రం లోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేయాలని మంగళవారం ధర్నా చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు వనం రాములు యాదవ్, పట్టణ అధ్యక్షులు దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా లేదని, రైతులు కల్లాలలో ధాన్యం పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు అని ఆరోపించారు. తేమ పేరుతో తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాలు కుమ్మక్కై రైతుల కంట తడి పెట్టిస్తున్నారని ఆరోపించారు.
కలెక్టర్, ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బారాస నాయకులు ఎద్దుల సాయి నాథ్, మాజీ చైర్మన్ కరుణ శ్రీ, పార్వతి, పద్మ, వడ్డె రమేష్, ఎల్లారెడ్డి, శేఖర్ గౌడ్, సంతోష్, సొప్పరి బీచుపల్లి, జగన్నాథం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.