11-09-2025 09:56:33 PM
- పక్క ప్రణాళికలతో అడుగులు వేస్తున్నాం
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్(విజయక్రాంతి): అభివృద్ధి అంటే ఇది అనేలా చేసి చూపిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం ముడా నిధులతో మహబూబ్ నగర్ నగరం లోని వీరన్న పేట లోని నీలకంఠ స్వామి దేవస్థానం ప్రాంగణం లో రూ10 లక్షల తో కమ్యూనిటీ హాల్ నిర్మాణపు పనులను పూర్తి చేయుటకు రూ 15 లక్షలతో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు ఆగకుండా, గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను సైతం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తున్నామన్నారు.
కేవలం 20 నెలలోనే రూ 250 కోట్లతో మహబూబ్ నగర్ నగరం లో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించామని ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గోపాల్ యాదవ్, శాంతన్న యాదవ్, ఎ.అంజయ్య, కుర్వ రాములు, నాయకులు లీడర్ రఘు, మల్లేష్ యాదవ్, జె.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.