11-09-2025 09:40:21 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రజలకు భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. గురువారం నగరంలో వార్డు 14 (వీరన్నపేట)లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఓబిసి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి మల్లేష్ ఏర్పాటు చేసిన14 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి బండి మల్లేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా సమస్యలతో వస్తే వారి సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారం చూపించాలని, సోదరభావంతో కలిసిమెలిసి అందరిని కలుపుకొని ముందుకు పోవాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శాంతన్న యాదవ్, గోపాల్ యాదవ్, లీడర్ రఘు, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.