14-05-2025 12:51:50 AM
మహబూబ్ నగర్ మే 13 (విజయ క్రాంతి) : అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకంపై ఎం.ఎస్. ఓ లు, ఎం.పి.డి.ఓ.లు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన వెబెక్స్ సమావేశం లో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం రాజీవ్ యువ వికాసం ద్వారా దరఖాస్తు చేసుకున్న రబ్జార్ల వివరణ పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సిబిల్ స్కోర్ బ్యాంక్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ విషయాలు ఎప్పుడు స్థాయిలో వేగంగా పనులు చేయాలని నిర్లక్ష్యంగా ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా పరిషత్ సీఈవో వెంకటరెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, హౌసింగ్ పిడి భాస్కర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శంకరా చారి, జిల్లా యువజన,క్రీడల అధికారి శ్రీనివాస్, మండల స్పెషల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.