calender_icon.png 12 September, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం పడిగాపులు

11-09-2025 09:39:57 PM

ఉదయం నుండి రాత్రి వరకు క్యూ లైన్ లో రైతులు 

సదాశివానగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామ సింగిల్ విండోలో యూరియా కోసం గురువారం రైతులు ఉదయం నుండి రాత్రి వరకు క్యూ లైన్ వేచి ఉన్నారు. యూరియా వస్తుంది అని తెలిసి రైతులు ఉదయం నుండి లైన్ లో నిలబడి ఉన్నారు. నిజామాబాద్ నుండి లారీ వస్తుంది అని సోసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు బారులు తీరారు. రాత్రి 7 అయినా ఇంకా రైతులు లైన్ లో నిలబడి ఉన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు మహిళ రైతులు కూడా లైన్ ఉన్నారు. ఇంతగా వేచి ఉండటం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేశారు.

400 బస్తాలు వస్తుంది 

విండో కార్యదర్శి దేవందర్ 

పద్మాజీవాడి సింగల్ విండో కార్యాలయానికి గురువారం 400 బస్తాలు వస్తున్నాందున రైతులకు టోకెన్ లు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నుండి రావాల్సిన లారీ సమయానికి రాలేనందున రాత్రి అయింది. టోకెన్ లు ఇచ్చిన రైతులందరికి ఏ రాత్రి అయినా యూరియా ఇస్తాము.