calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ 21 వార్డు స్థానాలకు 11 నామినేషన్ దాఖలు

27-11-2025 07:21:51 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మండలంలో ఉన్న 17 పంచాయతీలకు గాను గురువారం 11 గ్రామపంచాయతీలలో 21 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి, వార్డు స్థానాలకు రెండు గ్రామాలలో 11 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో జే. వెంకటేశ్వరరావు తెలిపారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారిలో మోదిని గూడెం నుండి బీరవోలు సుకన్య, గోరింకలపల్లి నుండి ముచ్చపోతుల నాగయ్య, నర్సింగ్ ఎల్లయ్య, ఒగోడు నుండి రంగు శైలజ, పల్లెబోయిన లెనిన్ బాబు, మాద ఎల్లేష్, వల్లభాపురం నుండి ఎం. శ్రీనివాస్, అంబటి జితేందర్, చందుపట్ల నుండి ఇమ్మడిపాక లక్ష్మి, దిగ్గోజు లత, మండలాపురం నుండి తీగల నాగయ్య, తీగల జంగయ్య, తీగల వెంకటయ్య, చందంపల్లి నుండి యార లలిత, నెల్లిబండ నుండి బోయిన కిషోర్, తాటికల్ నుండి చనగాని జానయ్య, నోముల నుండి బాధిని లక్ష్మీ, పొట్ట బత్తుల జయమ్మ, కడపర్తి నుండి పాటి యాదగిరిరెడ్డి, గొర్ల వీరయ్య, దుబ్బాక యాదగిరి రెడ్డి, వార్డు స్థానాలకు వల్లభాపురంలో పదిమంది, ఒగోడులో ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.