01-08-2025 12:00:00 AM
రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు తీర్పుపై ముస్తాబాద్‌లో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: జూలై 31 (విజయక్రాంతి): ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా ప్రచా రం చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, వే ములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. ముస్తాబాద్లో విలేకరులతో మా ట్లాడిన ఆయన, వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు బీఆర్‌ఎస్ పరిస్థితి తయారైంది, అంటూ ఘాటుగా విమర్శించా రు.
ప్రజా స్వామ్యన్ని ఖూనీ చేసిన బిఆర్‌ఎస్ గత పది సంవత్సరాల పాలనలో 60 మం దికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇలా వందలాది మందిని తమ పార్టీలోకి చేర్చుకున్న బీఆర్‌ఎస్, ఇప్పుడు ఇతరులు పార్టీ మారితే అనర్హత వేటు వేయాలని మాట్లాడడంలో వారి రెండు నాలుకల ధోరణి స్పష్ట మవుతుందన్నారు.
వాళ్ల హయంలో 60 మందిని చేర్చుకున్నపుడు, నోరు మెదపని బిఆర్ ఎస్, నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంటుంది అని చెప్పిన బిఅరెస్, ఇప్పుడు ఎందుకు నానా యాగీ చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు కూడా స్పీకర్ గడ్డం అధికారానికి వదిలెయ్యాలన్నారు. సుప్రీం కోర్టు కూడా మూడు నెలలో స్పీకర్ నిర్ణ యం తీసుకోవాలని సూచించిందన్నారు.
అ ప్పుడు అలా... ఇప్పుడు ఇలా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కేటీఆర్,హరీష్ రావు, కవిత లాంటి నాయకులు కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పడిపోతుందని ప్రచా రం చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి నా యకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ముందుకెళ్తోంది. మహిళల సంక్షేమం, ఇళ్ల నిర్మాణం, బీసీ హక్కుల పరిరక్షణపై ప్రభు త్వం కట్టుదిట్టంగా పని చేస్తోందని తెలిపా రు.
రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు బీసీ గణన చేపట్టినట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 42 శాతం ఇచ్చిన ప్ర భుత్వంలో భాగస్వామ్యం కావడం నా అదృ ష్టం అన్నారు. కవిత బీసీ నాటకం కవిత బీసీ అని చెప్పుకోవడం రాజకీయ నాటకమని ఆ ది శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. నిజం గా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్తో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలి. బీసీ బిల్లు ఢిల్లీలో పెండింగ్లో ఉండగా, హైదరాబాదులో డ్రా మాలు ఎందుకో ప్రజలకుచెప్పాలన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాం
గంభీరావుపేట జూలై 31 (విజయ క్రాంతి) మహిళలు ఆర్థికంగా ఎదిగి,ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వి స్తృత చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వి ప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామ సమాఖ్య మహిళా సం ఘం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, మాజీ మంత్రి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూరాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా నడిచే మూడో పెట్రోల్ బంక్ ఇది. ఇందిర మ్మ పాలన పునరావృతమవుతోందన్న సం కేతంగా ఇది నిలుస్తుంది. బ్యాంకుల జాతీయకరణం, దళితులకు భూకేటాయింపు, వడ్డీ లే ని రుణాల పథకాలతో పేదల జీవితాల్లో వె లుగు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
రా ష్ట్రంలో 93 లక్షల పేద కుటుంబాలకు సన్న బియ్యం, రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందిస్తున్నాం. మహిళా సంఘాల ద్వారా పాడి పశుపాలన, ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్లు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, స్కూల్ యూని ఫాం కుట్టే కేంద్రాలు ప్రారంభించాం. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ ల క్ష్యం అన్నారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మాట్లాడుతూ:
మన జిల్లాలో దివ్యాంగుల ద్వారా ఒక పె ట్రోల్ బంక్ ప్రారంభించాం. ఇప్పుడు మహి ళా సంఘం ద్వారా మరో పెట్రోల్ బంక్ ప్రా రంభం కావడం గర్వకారణం. ఈ బంక్ ద్వా రా వచ్చే ఆదాయాన్ని రివాల్వింగ్ ఫండ్గా వి నియోగించి మరిన్ని అభివృద్ధి పనులు చేయొచ్చు.ఇప్పటి వరకు నారాయణపేట, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మహిళా సంఘా ల ద్వారా పెట్రోల్ బంకులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.