31-07-2025 11:58:25 PM
మంథని,(విజయక్రాంతి): గ్రామస్తులు అడుగగానే మండలంలోని సీతంపేట లో బోరు వేసిన శ్రీధర్ బాబు కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద బోర్ వేశారు. గత కొన్ని ఏండ్ల నుండి హనుమాన్ టెంపుల్ వద్ద సుమారు 100 మంది హనుమాన్ భక్తులు, బ్రహ్మం గారి భక్తులు దీక్ష తీసుకుంటున్నారని, వారికి దేవాలయం వద్ద నీరు లేక స్నానాలకు త్రాగడానికి ఇబ్బంది పడుతున్నారని, గ్రామస్తులు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లగా స్పందించి మంత్రి వెంటనే బోర్ వేయించినారని, హనుమాన్ భక్తులు, బ్రహ్మంగారి భక్తులు సీతంపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు కు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందంకు, కాంగ్రెస్ మండల పడ్డ అధ్యక్షుడు బాలాజీకి గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.