calender_icon.png 2 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యురియా కోసం రైతుల పడిగాపులు

01-08-2025 12:00:00 AM

*స్టాక్ ఉన్నా లేదని కార్యాలయానికి సిబ్బంది తాళం

*రైతుల పక్షాన బీజెపీ ఆద్వర్యంలో దర్నా

*ఉన్నతాధికారుల చొరవతో యురియా పంపిణీ

తలకొండపల్లి,జులై 31:యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు మా త్రం స్టాకు ఉన్నా లేదంటూ దోబూచులాడుతున్నారు. దీంతో అగ్రహానికి గురైన పలువురు రైతు లు గురువారం మండల కేంద్రం లో సింగిల్ విండో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు రైతులు యూరియా కొనుగోలు కోసం సింగిల్ విండో గోదాముకు చేరుకున్నారు.

ఇది గమనించిన సిబ్బంది గోదాంలో ఒక లోడు యురియా స్టాక్ అందుబాటులో ఉన్నా లేదని చెప్పి కార్యాలయానికి తాళం వేసి తంబు మిషన్ ను తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఇట్టి విషయం తెలుసుకొన్న బీజెపీ శ్రేణులు రైతులతో కలిసి ఆఫీసు ముందు దర్నాకు దిగారు. అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఉన్నతాదధికారులతో మాట్లాడి స్టాక్ ఉన్న విషయం వారి దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి స్పందించిన అధి కారులు వెంటనే సిబ్బందిని ఆదేశించి రైతులకు యురియాను పంపిణీ చేశారు. స్టాక్ ఉన్నా రైతులకు యురియా లేదని చెప్పిన సిబ్బందిపై పలువురు మండిపడ్డారు. రైతుల పట్ల సిబ్బంది నిర్ల క్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజెపీ నాయకులు శానమొని పాండు,పద్మ అనిల్,నీలకంఠం, పాండు,వినయ్,శివ,రాజు,సురేష్,రైతులు రామస్వామి, మంజుల,శామల,నర్సింహ,చందునాయక్,జంగయ్య,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.