28-11-2025 01:20:02 AM
* 93 సర్పంచ్, 866 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
* కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
కరీంనగర్, నవంబరు 27 (విజయ క్రాంతి): జిల్లాలో తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. గురువారం రిటర్నింగ్ అధికారులు సర్పంచ్, వార్డు స్థానాలకు గురువారం నోటిఫికేషన్లను జారీ చేశారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డు మెంబర్ల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు.
రామడుగు మం డలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేం ద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నా మినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేష న్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చే యాలని కలెక్టర్ సూచించారు.
దాఖలైన నా మినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నా రు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎ న్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు.
కలెక్టర్ వెంట రామడుగు తహసిల్దార్ రాజేశ్వరి, ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు ఉన్నారు.కరీంనగర్ కు వచ్చిన పంచాయతీ ఎన్నికల పరిశీలకులతో సమావేశమైన కలెక్టర్‌ఎన్నికల జిల్లా పరిశీలకులు, హాక మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డితో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమ య్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీవాకాడేఉన్నారు.