calender_icon.png 7 September, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అన్నదానం

07-09-2025 07:45:57 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో ఆదివారం ప్రాథమిక ఉన్నత పాఠశాల హైస్కూల్ షాదుల్లా హుసేని దర్గా వద్ద మైనారిటీ సోదరులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మైనారిటీ సోదరులు మాట్లాడుతూ, ఇస్లాం మాసంలో రబి ఆల్ అవ్వల్ మాసాంతం మహమ్మద్ ప్రవక్త జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు మిత్రులు స్నేహితులు ఆత్మీయులతో కలిసి ప్రవక్త బోధించిన సహనం శాంతి దయ కరుణ ఐక్యత వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుందని ప్రవక్త చూపించిన బాటలో నడవాలని తెలిపారు.

ఈ సందర్భంగా కవ్వాలి ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని మైనార్టీ సోదరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ అధ్యక్షుడు సయ్య జమీర్, ఎస్.కె రషీద్, మొహమ్మద్ రియాజుద్దీన్, ఎస్కే ఖాసీం, జాఫర్ షా, సయ్యద్ పాషా, మమ్మద్ గౌస్, ఎండి మగ్దూం, ఎండి ఖాజా, సయ్యద్ అతిక్, సయ్యద్ ఫెరోజ్, ఎస్.కె లాయక్,ఎండి సమీర్, హనీఫ్ ఖాన్, అహ్మద్ షా, షేక్ అలీ, యాకుబ్ ఖాన్, సయ్యద్ సోహెల్, ఎండి గౌస్ షా, తదితరులు పాల్గొన్నారు.