05-07-2025 09:46:05 PM
గజ్వేల్: గంజిలో పడి చికిత్స పొందుతూ శుక్రవారం గాంధీ హాస్పిటల్ లో బాలుడు మృతి చెందాడు. గౌరారం ఎస్ఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన ముత్తి మహేశ్వరి, స్వామిల కొడుకు ముత్తి మొక్షిత్(02) అడుకోడానికి వారి ఇంటి పక్కనే వున్న వారి పెద్ద నాన్న ముత్తి ఎల్లం ఇంటికి వెళ్ళాడు. వారి ఇంట్లో కాచి వేడి చేసిన గంజి నీరు పాత్రలో పోసి వుంచగా బాలుడు మొక్షిత్ ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తూ తన కాలు ఆ పాత్రకి తాకి అందులోనే తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు గాంధీకి రిఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోక్షిత్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.