05-07-2025 09:53:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ను కోరన్నపేట చెందిన ఎం లక్ష్మీ తో పాటు మరో మహిళ మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాలపై నిలదీశారు. కురున్నపేట వార్డులో తమ సొంత ఇంటి స్థలంలోని అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మిస్తే మున్సిపల్ అధికారులు ఇంటి పనులను ఆపడం మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నచ్చని వారు ఫిర్యాదు చేస్తే తమ ఇండ్లు కులగోడతారా మేం ఫిర్యాదు చేస్తాం మీరు ఇండ్లన్నీ కుల కొట్టు రండి అంటూ వాగ్వివాదానికి దిగారు. అధికారులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే పేదవాళ్ల మాపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని తమకు న్యాయం చేయకపోతే ఇక్కడే కూర్చుంటామని హెచ్చరించారు