05-07-2025 09:50:46 PM
బంగారం కోసమే వృద్ధురాలు హత్య
వృద్ధురాలిని హత్య చేసిన నిందితుని పట్టుకున్న గజ్వేల్ పోలీసులు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గజ్వేల్ ఏసిపి నరసింహులు
గజ్వేల్: గజ్వేల్ మండలం పరిధిలోని ధర్మారెడ్డి పల్లిలో వృద్ధురాలి హత్య బంగారం కోసమే జరిగిందని గజ్వేల్ ఏసిపి నరసింహులు తెలిపారు. గత నెల 24 వ తేదీన రోజుల క్రితం ధర్మారెడ్డి పల్లి గ్రామంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో వ్యవసాయ భూముల్లో వృద్ధురాలు నల్ల సత్తవ్వ (70)ను గొంతు కోసి హత్య చేసిన నిందితున్ని గజ్వేల్ పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. గజ్వేల్ ఏసీపీ నర్సింలు శనివారం ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ చేగుంటలో ఎముకలకు కట్లు కట్టే వైద్యుడిగా చలామణి అవుతూ బైకుల దొంగతనానికి పాల్పడుతున్నాడు.
జూన్ 24వ తేదీన దొంగతనాలు చేయాలన్న ఉద్దేశంతో చేగుంట నుండి గజ్వేల్ కు బైక్ పై వచ్చాడు. తిరిగి చేగుంటకు వెళుతున్న క్రమంలో ధర్మారెడ్డి పల్లి రైల్వే బ్రిడ్జి వద్ద వ్యవసాయ పొలాల వద్ద నల్ల సత్తమ్మ వృద్ధురాలు ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. ఆమె సమీపానికి చేరుకొని ఎవరూ లేనిది చూసి కొడవలితో సత్తేవ్వ గొంతు కోసి ఆమె నగలను దొంగిలించి పారిపోయాడు. సత్తేవ్వ కుమారుడు మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సంఘటన ప్రాంతం నుండి వరుసగా 150 సీసీ కెమెరాలు పరిశీలించి వృద్ధురాలిని గొంతు కోసి చంపింది శివశంకర్ గా గుర్తించి అతనిని అరెస్టు చేసినట్లు ఏసీపీ నరసింహులు తెలిపారు.
హంతకుని వద్ద చంపడానికి వాడిన కొడవలి, దొంగలించబడిన బంగారపు చైస్, చెవి కమ్మలు, ఒక మొబైల్ ఫోను, మూడు టైళ్లు, రెండు ఆక్టివ వాహనాలు స్వాధీనపరచుకొని, అతన్ని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు అద్వర్యం లో గజ్వేల్ సీఐ సైదా , అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు, క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐ యాదగిరి, కానిస్టేబుల్ రవి, వెంకటేష్, నరేందర్ గౌడ్, వెంకన్న, స్వామి, దివ్య, ఐటి కోర్ సిబ్బంది శ్రీకాంత్, చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను పట్టుకొని అరెస్టు చేసినందుకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించి వారికి రివార్డ్ ప్రకటించినట్లు తెలిపారు.