10-08-2025 06:10:43 PM
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో ఆదివారం కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని, కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని, గతంలో కేసీఆర్ కిట్ల వల్ల మాతా శిశు మరణాలు తగ్గి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు.