calender_icon.png 10 August, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతలను సన్మానించిన గ్రామస్తులు

10-08-2025 06:15:50 PM

తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలం, నర్సాపూర్ గ్రామంలోని బస్టాండ్, ప్రజారాధిస్థలాలు, ప్రధాన కూడలిలు, దేవస్థానాల్లో ప్రజల సౌకర్యార్థం గ్రామస్తుల విజ్ఞప్తుల మేరకు సిమెంట్ బెంచ్ లా ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందజేసిన దాతలకు ఆదివారం గ్రామస్తుల సమక్షంలో గ్రామ పెద్దలు శాల్వాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు గుంటి గట్టయ్య, అల్లిబిల్లి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన కూడలిలో ప్రజలు కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో గ్రామస్తుల కోరిక మేరకు తరిగొప్పుల మండల మండల కేంద్రానికి చెందిన ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,  నర్సాపూర్ గ్రామానికి చెందిన గుంటి రాములు, గుంటి బంటి, మరియాపురం గ్రామానికి చెందిన తిరుమల్ రెడ్డి భాస్కర్ రెడ్డిని  సంప్రదించగా వారు స్పందించి గ్రామానికి సుమారుగా 60000 వెచ్చించి 20 సిమెంట్ బెంచ్ లను అందజేశారాన్నారు.