calender_icon.png 10 August, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

10-08-2025 06:06:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు పిఆర్టియు పోరాటం ఆగదని  తెలంగాణ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ అన్నారు. నిర్మల్ జిల్లా కార్యవర్గ సమావేశం  పెన్సనర్స్ భవన్ లో  జిల్లా అధ్యక్షులు చక్రాల హరిప్రసాద్ అధ్యక్షతన  జరిగింది. ఇందులో పలు అంశాలను ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర శాఖకు పంపడం జరిగింది. వెంటనే అందరికి ఆమోదయోగ్యమైన పీఆర్సీ ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్న  డీఏలను తక్షణమే విడుదల చేయాలి. ప్రస్తుతం జరుగబోవు జీహెచ్ఎం, ఎస్ఏ, పీఎస్హెచ్ఎం ఖాళీలను 1:1 కాకుండా 1:3  నిష్పత్తి ద్వారా నింపి ఖాళీలు లేకుండా చూడాలి. పీఎస్హెచ్ఎం పదోన్నతుల్లో బీ.ఈడీ అర్హత ఉన్న వారికి కూడా అవకాశం కల్పించాలి.  పండితులకు సంబంధించిన 1/2005 యాక్ట్ ను రద్దు చేయాలి.

 గతంలో 2 సార్లు ప్రమోషన్ నిరాకరించిన వారి పేర్లు పదోన్నతుల జాబితా నుండి ఖచ్చితంగా తొలగించాలి.. GPF,TSGLI, సరెండర్ లీవ్, మెడికల్ రీఅంబర్స్మెంట్ బిల్లులను తక్షణమే చెల్లించాలి. FRS నమోదులో అనునిత్యం చాలా ప్రాంతాలలో నెట్ వర్క్, సాంకేతిక సమస్యలతో  అనుపస్థితి చూపెడుతుంది కాబట్టి FRSను రద్దు చేయాలి. MEO, JL, DIET లెక్చరర్ పోస్ట్ లను ప్రమోషన్ ద్వారా నింపాలి. ఇంకా చాలా మంది 317 బాధితులు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వెంటనే వారిని వారి స్వంత జిల్లాలకు పంపాలి.