ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి
కూల్చివేతలపై ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఫైర్
అమీన్ పూర్: పటాన్‌చెరు నియోజకవర్గం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్‌కు చెందిన బిఆర్ఎస్ పార్టీ వ్యక్తి అని ప్లాన్ ప్రభుత్వ భూమి పేరుతో అక్రమంగా కూల్చివేయడం అన్యాయమని అన్నారు. అయితే ఆ స్థలం 1954 నుండి వారి పూర్వీకుల సొంతమని, భూ భారతి పోర్టల్ సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా కూల్చివేతలకు పాల్పడటం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని విమర్శించారు.
ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ మాణిక్ యాదవ్ సర్వే నంబర్ 148 36 గుంటల భూమిలో చిన్నగా ఇల్లు కట్టుకుని చుట్టుపహరి పూర్తిగా కూల్చివేసి ఇల్లుని కూల్చివేశారు. సిద్దు అనే వ్యక్తి జీవనాధారం అయిన RO ప్లాంట్‌ను కూల్చివేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. అదే సర్వే నంబర్‌లో ఉన్న కొన్ని నిర్మాణాలను వదిలిపెట్టడం ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని చూపుతోందని అన్నారు.
అదేవిధంగా, అక్కడ నివసిస్తున్న కిరాయిదారులకు తమ సామగ్రిని బయటకు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అత్యంత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని, రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే మందగమనం లో ఉన్న సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రభుత్వ భూములను గుర్తించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.






