calender_icon.png 24 October, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలివానతో నేలకొరిగిన వరి

22-10-2025 12:43:40 AM

కోదాడ అక్టోబర్ 21: కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీనితో 150 ఎకరాలకు పైగా వరి పంట నేలకొరిగింది. దీనితో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పైరు నష్టపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం రాష్ర్టం ఉపాధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతాంగం కష్టాల్లో ఉందని వెంటనే ఆదుకోవాలని కోరారు.