calender_icon.png 12 January, 2026 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల పండుగలు పుస్తకం ఆవిష్కరణ

12-01-2026 12:00:00 AM

ఉట్నూర్/ఖానాపూర్, జనవరి 11 (విజయక్రాంతి): ఆదివాసీల కోసం చివరి క్షణం వరకు జీవితాన్ని ధార పోసిన మహనీయులు, మానవ శాస్త్రవేత్త హైమన్ డార్ప్-బెట్టి ఏలిజీబెత్‌లను స్పూర్తిగా తీసుకొని వారి యాదిలో స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ్యులతో పాటు నిరాశ్రయులకు అండగా నిలవడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడం కోసం పుస్తకాలను రాయడం శుభ పరిణామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  పేర్కొన్నారు.

ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్వ సంతోష్ పునః ప్రచురించిన మావంగ్ సడ్క్ (ఆదివాసీల పండుగలు) పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, బీఈడీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, సర్పంచ్ రమేశ్, దస్తురాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరాలతో నిరుపేదలకు మేలు

వెల్నేస్ హాస్పిటల్ నిజామాబాద్, మైత్రి హాస్పిటల్ ఖానాపూర్ సహకారంతో పాత ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు,  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... హాస్పిటల్ వెళ్లే స్థోమత లేని నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాల వల్ల మేలు జరుగుతుందన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సర్పంచ్ ప్రశాంత్‌రెడ్డి, హాస్పిటల్ యాజమాన్యంను ఎమ్మెల్యే అభినం దించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.